జగన్ పెంచిన పన్నులు, ధరలు, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని టీడీపీ నారా లోకేష్ ప్రకటించారు. స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా చెల్లాయపాలెం క్యాంప్ సైట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం యువగళం పాదయాత్ర 148వరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు నారా లోకేష్ ఘనస్వాగతం పలికారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. మహిళలు, చిరువ్యాపారులు, ప్రజలు.. అధిక ధరలు, విపరీతంగా పెరిగిన కరెంటు చార్జీలు, రకరకాల పన్నుల బాదుడు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పాలనలో పెంచిన పన్నులు, ధరలు, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు లోకేష్. బుచ్చిరెడ్డిపాలెం బహిరంగసభకి హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించానన్నారు.