“పిల్లాడి పక్కలో పిల్లదెయ్యం”..సోషల్ మీడియాలో వైరల్..!!!

-

సహజంగా దెయ్యాలు ఉండవు కానీ ఆత్మలు ఉంటాయి అంటారు. అసలు ఆత్మలు అంటే ఏమిటి, దెయ్యాలు అంటే ఏమిటి , నిజంగా దెయ్యాలు ఉంటాయా, ఆత్మలు ఉన్నాయా అంటే చాలా సందర్భాలో ఆత్మలు ఉన్నాయని నిరూపించబడింది. దెయ్యాలు ఆత్మల గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా సరే అసలు విషయం ఏమిటంటే..

సహజంగా ఎంత ధైర్యవంతుడైన మనిషి అయినా ఎదో ఒక సందర్భంలో భయపడక తప్పదు.  ఆత్మలు లేవు, దెయ్యాలు లేవు అనే వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో భయపడిపోతారు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చు అయితే అమెరికాలో ఓ మహిళ ఎదురైనా విచిత్ర సంఘనట ఆమెని కొన్ని గంటల పాటు షేక్ చేసింది. చివరికి అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది. అసలేం జరిగిందంటే.

అమెరికాలో ఇల్లినాయిస్ నగరానికి చెందిన ఓ మహిళ తన 18 నెలల కొడుకుని అతడి చిన్నపాటి పిల్లల మంచంపై పడుకోబెట్టింది. తన పిల్లవాడి పరిస్థితి గమనించడానికి మోనిటర్ ద్వారా చూస్తున్న క్రమంలో ఒక్కసారిగా తన పిల్లాడి పక్కనే మరొక పిల్లడు పడుకున్నట్టుగా కనిపించింది. తదేకంగా చూసిన ఆమెకి ఆ పిల్లాడు నవ్వుతున్నట్టుగా కనపడటంతో ఒక్కసారిగా దేయ్యమనుకుని పరుగులు తీసింది. తీరా చూస్తే తన పిల్లాడి పక్కన ఉన్నది పరుపు కంపెనీ స్టికర్ పై ఉన్న నవ్వుతున్న పిల్లాడిబొమ్మ. తన భర్త పరుపుపై దుప్పటిని మార్చకపోవడం వలన తానూ ఇలా కంగారుపడ్డాను అని సోషల్ మీడియాలో పంచుకుంది. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యి చెక్కర్లు కొడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news