రూ. 1000 కోట్లు అప్పు చేయనున్న తెలంగాణ సర్కార్ ?

-

తెలంగాణ సర్కార్ మరో రూ. 1000 కోట్లు అప్పు చేయనుంది. ఇందులో భాగంగానే, తెలంగాణ ప్రభుత్వం మరో రూ. వెయ్యి కోట్ల రుణాల సేకరణకు RBI వద్ద బాండ్లను వేలానికి పెట్టింది. తెలంగాణతో కలిపి మొత్తం 7 రాష్ట్రాల తరపున రూ. 10,400 కోట్ల రుణాల సేకరణకు ఈనెల 11న బాండ్లను వేలం వేయనున్నట్లు RBI ప్రకటించింది. వీటిలో తమిళనాడు రూ. 3 వేల కోట్లు, ఏపీ, హర్యానా రూ.2 వేల కోట్ల చొప్పున రుణాలు తీసుకొనున్నాయి.

కాగా.. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు బాగా చేస్తుందని విపక్షాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. కాగా, అప్పులు చేసినప్పటికీ.. సంక్షేమం పేరుతో ముందుకు పోతుంది కేసీఆర్‌ సర్కార్‌. తెలంగాణలో ఎరుకుల వర్గం కోసం ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఎరుకుల వర్గ సాధికారత కోసం రూ. 60 కోట్లతో పథకాలు అమలు చేయనున్నట్లు ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్ తెలిపారు. ఈ నిధులను ప్రాథమిక పందుల పెంపకదారుల సంఘాలకు అందిస్తారు. శాస్త్రీయ పద్ధతుల్లో పందుల పెంపకం కోసం సామాజిక స్థాయిలో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక సాయం అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news