BREAKING : పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు

-

BREAKING : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు అయింది. పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశారు వాలంటీర్లు. వారాహి యాత్రలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయన పై కేసు నమోదు అయింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు విజయవాడ కృష్ణలంక పోలీసులు. పవన్ కళ్యాణ్ పై సెక్షన్ 153, 153A, 505(2) IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సెక్షన్ 153 ప్రకారం పవన్ కళ్యాణ్ మాటల మూలంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందనీ కేసు నమోదు చేశారు. 153 A కింద రెండు మతాలు, రెండు కులాల మధ్య విద్వేషాలుకు అవకాశం వుంది అంటూ మరో సెక్షన్ నమోదు చేశారు. 505(2) కింద తాను చెబుతున్నది రూమర్ అని తెలిసిన కావాలని చెప్పడంతో గొడవలు జరిగే అవకాశం ఉందంటూ మరో సెక్షన్ కింద కేసు పెట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news