బొత్సను బర్త్ రఫ్ చేయాల్సిందేనని ఏపీ ప్రభుత్వానికి గంగుల కమలాకర్ రావు వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉంది.. టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లోనే ఏ రకంగా స్కాంలు జరిగాయో చూస్తున్నామని… బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు గంగుల కమలాకర్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో 308 గురుకులాలే ఉన్నాయని ఎద్దేవా చేశారు.
తెలంగాణ, ఏపీలో ఎన్ని గురుకులాలున్నాయో బొత్స తెలుసుకోవాలని చురకలు అంటించారు గంగుల కమలాకర్ రావు. ఏపీలో విద్యావ్యవస్థ అసలు ఎక్కుడుందని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ స్కాంను బయటపెట్టింది మా ప్రభుత్వమే కదా.. మీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బదిలీలను అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు. దొడ్డిదారిని తెలంగాణకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు గంగుల కమలాకర్. వెంటకనే బొత్సను సీఎం జగన్ బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు గంగుల కమలాకర్ రావు.