చెప్పులు వేసినా పట్టించుకోలేదు.. ఎందుకంటే రైతులది బతుకు పోరాటం : మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

-

బాల్కొండ నియోజకవర్గంలో గురువారం మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మెండోరా ప్రాంత రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్రజలకు ఎంత మంచి చేసినా కృతజ్ఞత చూపించడం లేదని, ఇందుకు తనకు చాలా బాధగా ఉందని
ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చినా కనికరం చూపించరా? అన్నారు. గతంలో కాకతీయ లీకేజీ నీళ్లు విడుదల చేయకపోతే ఆందోళనలు చేశారని, హైదరాబాద్ కు తరలి వచ్చారన్నారు.

R&B Minister Prashanth Reddy says BJP treating Telangana as its enemy.

తనపై చెప్పులు వేసినా పట్టించుకోలేదని, ఎందుకంటే రైతులది బతుకు పోరాటమన్నారు. శ్రీరామ్ సాగర్ నీళ్లు తొలుత అందేది మెండోరాకే అన్నారు. ఇప్పుడు కాళేశ్వరం నుండి నీరు తెస్తే కెనాల్ కమిటీ వారు కనీసం కృతజ్ఞతలు చెప్పేందుకు మెండోరాకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత మంచి చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

కేసీఆర్ అనవసరంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడని, కాంగ్రెస్ వాళ్లు మూడు గంటలు ఇస్తారట, అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టాలని వారు చూస్తున్నారని, అలాంటి వారిని తరిమి కొట్టాలని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మోర్తాడ్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది పనుల పరంపర కొనసాగుతుందన్నారు. రైతులకు మిషన్ భగీరథ లాగే వ్యవసాయ పొలాలకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వర్షాలు రాకున్నా సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news