ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యూయోట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ఫలితాలను ఈరోజు ఆంధ్రా యూనివర్సిటీ వీసీ విడుదల చేశారు. వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 సెంటర్స్ లో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 30,156 మంది నమోదు చేసుకోగా 26,799 హాజరయ్యారు. అందులో 85.29% ఉత్తీర్ణతతో 22,858 మంది ఉతీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో మహిళలు 85.33% పురుషుల విభాగంలో 85.24% మంది ఉత్తీర్ణత సాధించారు. 21 యొక్క విభాగాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
ఫిజికల్ ఎడ్యుకేషన్ మినహా అన్ని విభాగాల ఫలితాలు రిలీజ్ చేశారు. అయితే ఏపీ లాసెట్, పీజీ ఎల్ సెట్ 2023 పరీక్షల ఫలితాలు. విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 20న ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలకు మొత్తం 16,203 మంది హాజరు కాగా.. వారిలో 13,402 మంది క్వాలిఫై అయ్యారు.