10 రోజుల బిడ్డకు గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన వైద్యులు

-

ఇటీవల జయమ్మ అనే ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈమె కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందింది. అయితే సదరు మహిళకు హైబీపీ ఉన్నందున ఏడో నెలలోనే సి-సెక్షన్ చేసి.. బిడ్డను బయటకు తీశారు వైద్యులు. ఆ సందర్భం లో శిశువు బరువు కేవలం 1.5 కిలోలు మాత్రమే. ఏడో నెలలో జన్మించడంతో శిశువు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల పనితీరు సరిగా ఉండేది కాదు. అందునా ప్లేట్లెట్ కౌంట్ 9000కి పడిపోవడంతో.. గుండెకు రక్త ప్రసరణ సరిగా జరిగేది కాదు.

ఈ నేపధ్యం లో బిడ్డకు మెరుగైన ఆరోగ్యం కోసం సదరు వైద్యులు.. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.అప్పుడు శిశువు ఆరోగ్యం అంతంతమాత్రమే. దీంతో వైద్యులు.. 6 రోజుల పాటు బిడ్డను కృత్రిమ వెంటిలేషన్‌లో ఉంచి వైద్యం అందించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో ఉన్నట్టుండి ఆ శిశువు గుండె ఆగిపోయింది. తక్షణమే అప్రమత్తమైన వైద్యులు.. బిడ్డకు సీపీఆర్ చేసి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news