అమెరికాలో తెలుగు సాహితీ సదస్సుకి భారీ ఏర్పాట్లు…!!!

-

అమెరికాలో ఉంటున్న తెలుగు వారు తమ మాతృభాష ని రక్షించుకోవాలనే తపన, కోరిక బలంగా ఉండబట్టే ఇప్పటికీ విదేశంలో తెలుగుదనం విరాజిల్లుతోంది. ఎన్నో సంస్థలు తెలుగుపై తమకి ఉన్న ప్రేమని అభిమానాన్ని ఎప్పటికప్పుడు తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో కనబరుస్తూనే ఉంటారు. వంగూరి ఫౌండేషన్ కూడా తెలుగు బాష, సంస్కృతిని కాపాడటంలో ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలోనే వంగూరి ఫౌండేషన్ తెలుగు సాహితీ సదస్సుకి భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

అమెరికాలోని ఓర్లాండ్ లో 11వ తెలుగు సాహితీ సదస్సుని నవంబర్ 2 , 3వ తేదీలలో నిర్వహించనుంది. కేవలం తెలుగు వెలుగుకి పెద్దపీట వేస్తూ ఏర్పాటు చేస్తున్న ఈ వేడుకలని ఎంతో వైభవంగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ వేడుకలకి అష్టావధానులు, పండితులు, కవులు, సంగీత, వాయిద్య నిపుణులని ఆహ్వానిస్తోంది. అంతేకాదు..

 

వేడుకల ప్రారంభ తేదీ అనగా నవంబర్ 2 వ తేదీన 12 వ ఘంటశాల ఆరాధనోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత గాయకులని కూడా ఆహ్వానిస్తోంది. అలాగే  విచ్చేసిన కవులు, రచయితలుప్రేక్షకులు ఇచ్చే అంశం మీద ప్రసంగించాల్సి ఉంటుంది. అలనాటి వారికి బహుమతులు కూడా అందించ బడుతాయి. ఈ వేడుకలకి విచ్చేసే వారికి ముఖ్యంగా ఫ్లోరిడా నుంచీ వచ్చే వారికి 50 డాలర్ల ఫీజుని నిర్ణయించగా, మిగిలిన రాష్ట్రాల నుంచీ విచ్చేసే వారికి ఉచిత ఎంట్రీ ఇస్తున్నారు. నోరూరించే తెలుగు వంటలు, వీనుల విందైన  తెలుగు పాటలతో ఈ వేడుకలు ఆద్యాంతం అలరించనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news