మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.900 కోట్ల కుంభకోణం బట్టబయలవడంతో తాడేపల్లి పెద్దలకు నిద్ర కరువైందని ఎద్దేవా చేశారు. రుణం తీసుకున్నది రాయలసీమ ప్రాజెక్టు ఇన్వెస్ట్ గేషన్ పనులకో? ప్రాజెక్టు నిర్మాణ పనులకో తేలాలని, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేయమని కోర్టులో స్టే ఇచ్చి కోర్టును మోసం చేశారన్నారు.
అంతేకాకుండా.. ప్రాజెక్టు పనులు చేయమని కోర్టులో అఫిడెవిట్ ఇచ్చిన విషయాన్ని పీఎఫ్సీకి, ఆర్ఐసీకి తెలపకుండా మోసం చేసి రుణం తెచ్చారు.ప్రాజెక్టు నిర్మాణానికి తెచ్చిన రూ.700 కోట్లలో ఎలక్ట్రో మెకానికల్ పనులకు వంద కోట్లు పోయినా.. మిగతా 6 వందల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? విద్యుత్ జనరేషన్ పై వేస్తున్న ట్యాక్సులు ఎవరు కట్టాలి..? కొత్త కార్పొరేషన్ పెట్టి ఆదాయం కోసం నిధులుక నీటి మీద వినియోగించడం రాజ్యంగ విరుద్ధం. కోర్టులను, ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వం డబల్ గేమ్ ఆడుతోంది. రాయలసీమ ప్రాజెక్టు పనుల నిధుల వినియోగం సరిగా జరగడంలేదు. నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరపాలి అని ఆయన డిమాండ్ చేశారు.