అమెరికాలోని అలాస్కా భూభాగాన్ని కుదిపేసిన భూకంపం

-

అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. శనివారం రాత్రి ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా గుర్తించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించింది. రాత్రి 10.48 గంటలకు భూమి తీవ్రంగా కంపించిందని, శాండ్ పాయింట్ అనే చిన్న పట్టణానికి నైరుతి దిశగా 55 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వివరించింది.

 

7.2 earthquake off the Alaska coast triggers brief tsunami advisoryభూకంప తీవ్రత దృష్ట్యా అలాస్కా, అమెరికాలోని ఇతర తీర ప్రాంతాలు, కెనడా, పసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అలాస్కా అమెరికాలో అత్యంత శీతలంగా ఉండే ప్రాంతం. ఇక్కడ జనావాసాలు తక్కువ. దాంతో, తాజా భూకంపం కారణంగా ప్రాణనష్టం లేనట్టు తెలుస్తోంది. అయితే, పలు సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగడంతో ప్రజలు హడలిపోయారు. ఇళ్లలోంచి, ఇతర భవనాల్లోంచి బయటకు పరుగులు తీశారు. అలాస్కాలో 1964లో 9.2 తీవ్రతతో పెను భూకంపం సంభవించగా, ఆ సమయంలో ఎగసిపడిన సునామీ ధాటికి 250 మందికి పైగా మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news