సుధా నారాయణమూర్తి దంపతులు శ్రీవారికి భారీ విరాళం సమర్పించారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు బంగారు శంఖం సమర్పించారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఈఓ ధర్మారెడ్డికి బంగారు శంఖం అందజేశారు. బంగారు తాబేలు, బంగారు శంఖంను శ్రీవారికి కానుకగా అందజేశారు. 2 కిలోల బంగారంతో వీటిని ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలుస్తోంది. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో ఉపయోగించేందుకు బంగారు శంఖువును కానుకగా ఇచ్చారు. దర్శనం అనంతరం తిరుమల వేద పండితులు.. వారికి వేద ఆశీర్వాదం అందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి శేషవస్త్రంతో మూర్తి దంపతులను సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని బహుకరించారు.
తిరుమల వేంకటేశ్వర స్వామిని సుధామూర్తి ఇష్టదైవంగా భావిస్తారు. ఏటా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. 70 ఏళ్లుగా తిరుమల కొండకు వస్తున్నానని సుధామూర్తి తెలిపారు. తొలిసారి తాను 1953లో తిరుమల కొండకు వచ్చానని ఆమె చెప్పారు. కోరుకున్న కోరికలు తీరడంతో అందరి భక్తుల మాదిరిగానే ఏటా శ్రీవారి దర్శనానికి వస్తున్నానని ఆమె చెప్పారు.