కేసీఆర్ నిజంగానే గజ్వేల్ బరిలో లేరా? రేవంత్ కాన్ఫిడెన్స్ ఏంటి?

-

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదా? వేరే నియోజకవర్గానికి మారుతున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న చర్చ బట్టి చూస్తే అదే నిజమనిస్తుంది. ఈ సారి ఎన్నికల్లో కే‌సి‌ఆర్ గజ్వేల్ నుంచి కాకుండా వేరే చోట పోటీ చేస్తారనే టాక్ వస్తుంది. అయితే ఆ విషయం కూడా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇటీవల ఉచిత విద్యుత్ పై బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి..బి‌ఆర్‌ఎస్‌కు కౌంటర్లు ఇస్తూ…దమ్ముంటే కే‌సి‌ఆర్ అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలని, అలాగే కే‌సి‌ఆర్ గజ్వేల్ బరిలోనే పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. అయితే ఈ సవాల్‌కు బి‌ఆర్‌ఎస్ నేతల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. దీంతో కే‌సి‌ఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదనే డౌట్ వస్తుంది. ఇదే సమయంలో మరొకసారి రేవంత్ సవాల్ చేశారు.  కేసీఆర్ మగాడు అయితే గజ్వేల్ నుంచి పోటీ చేయాలి లేదంటే మాడా అని ఒప్పుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ గజ్వేల్ నుండి పోటీ చేస్తే వాళ్లు వేసే ఏ శిక్షకి అయినా తాను సిద్ధమని,  80 శాతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారని, అందులో కేసీఆర్ కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. అంటే కే‌సి‌ఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఏ శిక్షకైనా రేవంత్ రెడీ అంటున్నారంటే..కే‌సి‌ఆర్ పోటీ చేయరనే అంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. లేదా బి‌ఆర్‌ఎస్ వర్గాల నుంచి ఏదైనా సమాచారం వచ్చి ఉండాలి.

అయితే దీనిపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ..కే‌సి‌ఆర్ ఎక్కడ పోటీ చేసిన గెలుస్తారని, మీడియాలో సెన్సేషన్ కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఎక్కడ పోటీ చేసిన గెలుస్తారని అంటున్నారు..కానీ గజ్వేల్ లోనే పోటీ చేస్తారని చెప్పడం లేదు. మొత్తానికి గజ్వేల్ బరిలో ఉండటం లేదని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news