తెలంగాణాలో అధికారంలో ఉన్న BRS పార్టీకి ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ దెబ్బమీద దెబ్బ తగులుతోంది అని చెప్పాలి. ఈ మధ్యనే కాంగ్రెస్ లో ఉన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు లు కాంగ్రెస్ లోకి జంప్ అయిపోయారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం BRS మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీని విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారట. తాజాగా తీగల కృష్ణారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో తన కోడలు అనితతో కలిసి మీట్ అయినట్లు తెలుస్తోంది. కాగా రేవంత్ రెడ్డి అడగడం మూలంగానే ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నట్లు స్పష్టంగా అర్దమవుతోంది. కాగా ఈయన పార్టీని వీడడానికి కారణం వచ్చే ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో ఇవ్వరో అన్న ఆందోళనతోనే అని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో BRS తరపున ఎమ్మెల్యే గా పోటీ చేసినా ఓడిపోయిన తీగలకు టికెట్ ఇవ్వరని కాంగ్రెస్ లోకి వెళుతున్నారట. కాగా ఎన్నికల వేళలో నేతలు అంతా పార్టీలు మారుతుంటే BRS కార్యకర్తలలో నమ్మకం సన్నగిల్లుతుంది.