Khaidi Review ఖైదీ రివ్యూ: త‌ప్ప‌ని స‌రిగా చూడాల్సిన థ్రిల్ల‌ర్ ఖైదీ

-

నటీనటులు: కార్తీ, నరేన్ కుమార్, హరీష్ ఉత్తమన్, హరీష్ పేరడి తదితరులు
సంగీతం: శ‌్యామ్ సి.ఎస్
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్‌: ఫిలోమిన్ రాజ్
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రభు – రాధామోహన్
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
రిలీజ్ డేట్‌: 25 అక్టోబ‌ర్‌, 2019

తెలుగులో అవారాతో వ‌చ్చిన క్రేజ్‌తో పాపుల‌ర్ అయిన సూర్య సోద‌రుడు కార్తీ ఖాకీ, ఊపిరి సినిమాల‌తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. త‌ర్వాత వ‌రుస ప్లాపుల‌తో కార్తీ మార్కెట్ పూర్తిగా ప‌డిపోయింది. మ‌ళ్లీ ఇప్పుడు సందీప్ కిష‌న్ హీరోగా వ‌చ్చిన న‌గ‌రం లాంటి సినిమాను తెర‌కెక్కించిన లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఖైదీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ప్రోమోల‌తో ఆస‌క్తి రేపిన ఈ సినిమా ఎలా ఉందో ? స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
సినిమా కథ మొత్తం కేవలం ఒకే ఒక్క రాత్రి లో జరుగుతుంది. ఢిల్లీ బాబు (కార్తి) ఒక పెద్ద పేరుమోసిన ఖైదీ. అతను తన కూతురుని మొట్టమొదటి సారి చూడాల కొద్ది రోజులుగా జైలులోనే క‌ల‌లు కంటూ ఉంటాడు. చివ‌ర‌కు అత‌డు జైలు నుంచి రిలీజ్ అయిన రోజు రాత్రే పోలీసులు వ‌ర్సెస్ డ్ర‌గ్స్ మాఫియా వార్‌లో త‌న‌కు తెలియ‌కుండానే ఇరుక్కుంటాడు. అస‌లు ఆ గొడ‌వ‌లో ఢిల్లీ బాబు ఎందుకు ? ఇరుక్కున్నాడు. త‌న కూతురును క‌లుసుకున్నాడా ? ఆ రోజు రాత్రి ఏం జ‌రిగింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ‌:
కేవ‌లం క‌థ‌ను మాత్ర‌మే న‌మ్ముకుని చేసిన సినిమా ఇది. ఈ సినిమా క‌థ అంతా ఒక రాత్రి నాలుగు గంట‌ల స‌మ‌యంలోనే న‌డుస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమా అన‌గానే గుర్తుంచుకునే హీరోయిన్లు, సాంగ్స్‌, కామెడీ ఈ సినిమాలో లేక‌పోయినా వాటికి మించిన కథ, బలైమన ఎమోషన్, అలాగే ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాలో ఉన్నాయి. కేవలం కథ డిమాండ్ మేర‌కు మాత్ర‌మే ద‌ర్శ‌కుడు రాసుకున్న సీన్లు మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయి.

కథ సింపుల్ గా ఉన్న ప్రతి సీన్లో స్క్రీన్ ప్లే చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంది. కార్తీ, ఖైదీ పాత్రలో అద్భుతంగా నటించారు. కూతురు మీద ప్రేమను వ్యక్త పరిచే సన్నివేశంలో.. త‌న ప్లాష్‌బ్యాక్ సీన్లోనూ, చివ‌ర్లో కూతురును క‌లుసుకునే సీన్లో కార్తీ న‌ట‌న మ‌న‌స్సుల‌ను క‌దిలించేలా ఉంది. ఖైదీ డై హార్ట్ యాక్ష‌న్ ప్రియుల‌ను బాగా మెప్పిస్తుంది. తండ్రి కూతుర్ల మధ్య ఎమోషన్ సెకెండ్ హాఫ్ లో బాగా ఎలివేట్ చేసినా.. ఆ ఎమోషన్ని ఫస్ట్ హాఫ్ లో కూడా ఆ రేంజ్ లోనే ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఫస్ట్ హాఫ్ ఇంకా బెటర్ గా ఉండేది.

ఇలాంటి క‌థ‌ల‌ను న‌మ్ముకుని… పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్షణ బేస్ చేసుకుని… అనవసరపు సన్నివేశాలను ఇరికించకుండా కథకు అనుగుణంగా సినిమా మొదటి ఫ్రేమ్‌ నుండి చివరి ఫ్రేమ్‌ వరకూ దర్శకుడు సినిమాని బాగా నడిపాడు. కార్తీతో పాటు మిగిలిన న‌టులు కూడా బాగా న‌టించారు. ఇక మైన‌స్‌ల ప‌రంగా చూస్తే కొన్ని చోట్ల లాజిక్‌లు మిస్ అయ్యాయి. ఇక రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారికి ఈ సినిమా ఎంత వ‌ర‌కు న‌చ్చుతుందో ? చెప్ప‌లేం.

టెక్నిక‌ల్‌గా ముఖ్యంగా శ్యామ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశంలోని ప్రతి ఎమోషన్ ని చాలా బాగా ఎలివేట్ చేసింది. సత్యన్ సూర్యన్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఫీలోమిన్ రాజ్ ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది. ఇక యాక్ష‌న్ మామూలుగా లేదు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మరియు వివేకానంద ఫిలిమ్స్ అందించిన నిర్మాణ విలువలు సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి.

ఫైన‌ల్‌గా…
ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌ని స‌రిగా చూడాల్సిన థ్రిల్ల‌ర్ ఖైదీ

ఖైదీ రేటింగ్‌: 3 / 5

Read more RELATED
Recommended to you

Latest news