ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలో నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే విషయం ఖరారు అయిపోయింది, గత ఎన్నికల్లో అనిల్ కుమార్ పై పోటీ చేసి ఓడిపోయిన పొంగూరు నారాయణ ఈసారి కూడా బరిలోకి దిగుతున్నారు. కానీ ఈ సీటును ఆశించిన మాజీ నుడా చైర్మన్ మరియు ఈ మధ్య వరకు టీడీపీ నెల్లూరు సిటీ ఇంచార్జి గా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొంచెం అలకబూనారు అని చెప్పాలి. ఈ మధ్యన నేను నారాయణ విజయానికి కృషి చేయను అన్న రీతిలో వ్యాఖ్యలు చేశాడనై వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వార్తలు అవాస్తవం అని తెలియచేయదనాయికి కాసేపటి క్రితమే మీడియా సమావేశానికి వచ్చిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ… నెల్లూరు నగర ఎమ్మెల్యేగా మాజీ మంత్రి నారాయణను 50 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు.
ఈ రోజు ముస్లిం మైనారిటీ నేతలతో సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి మీడియా ముఖంగా వారి అభివృద్ధికి మేమెప్పుడూ అండగా ఉంటామని చెప్పారు.