మణిపూర్ లో దారుణాలు జరుగుతున్న 79 రోజుల తర్వాత ప్రధాని మోదీ స్పందించడం బాధాకరమని టీకాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ప్రజలు తనపై వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని తగ్గించేందుకే మోదీ మాట్లాడారని అన్నారు. గత నెలలో రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనను కూడా బీజేపీ అడ్డుకుందని విమర్శించారు. కుకీ తెగపై జరుగుతున్న దాడులు, హత్యాచారాలు బాధాకరమని చెప్పారు. పిల్లలు అని కూడా చూడకుండా హత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గత నెలలో రాహుల్ పర్యటనను బీజేపీ సర్కారే అడ్డుకుందని ఆరోపించారు. మణిపూర్ ఘటన మన దేశంలోనే జరిగేది అన్నట్లుగా వుందన్నారు. దీనికి బీజేపీ సర్కార్ వైఫల్యమే కారణమన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు వున్న స్పెషల్ స్టేటస్‌ను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాలే తప్పా మరేం లేవని, పిల్లలు అని చూడకుండా హత్యాచారాలు జరుగుతున్నాయని సీతక్క మండిపడ్డారు.