BREAKING : తెలంగాణకు మరో 5 రోజుల పాటు వర్షాలు !

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణకు మరో 5 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. గురువారం తెరపి లేకుండా వానలు పడ్డాయి. నైరుతి రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

మరో ఐదు రోజులు వర్షాలు పడతాయని…ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో ఎన్డిఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news