బాబు సైలెంట్ గేమ్..పొత్తుపై టీడీపీ స్టాండ్ ఫిక్స్.!

-

ఏపీ రాజకీయాల్లో ఇటీవల టి‌డి‌పి అధినేత చంద్రబాబు సైలెంట్ గా ఉంటున్నారు. ఎప్పుడైతే పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి బాబు సైలెంట్ గా ఉంటున్నారు. అంతకముందు ప్రజల్లోకి వెళ్లారు..భారీ సభలు నిర్వహించారు. పవన్ ప్రజల్లోకి రాగానే బాబు సైలెంట్ అయ్యారు. అంటే ఇద్దరి మధ్య ఒక అండర్ స్టాండింగ్ ఉందా? లేదా? అనేది తెలియదు గాని..ప్రస్తుతానికి సైలెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు.

ప్రజల్లో లేకపోయినా టి‌డి‌పి నేతలని బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి పంపించారు. మినీ మేనిఫెస్టో ప్రజలకు చేరువయ్యేలా చేస్తున్నారు. అటు నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఇక బాబు ఖాళీగా ఉన్న నియోయజకవర్గాలకు ఇంచార్జ్‌లని నియమిస్తున్నారు. అలాగే ఓటర్ల లిస్ట్ అవకతవకలపై ఎప్పటికప్పుడు టి‌డి‌పి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా బూత్ స్థాయి కార్యకర్త దగ్గర నుంచి ఇంచార్జ్ వరకు ఏం చేయాలనే అంశంపై నేతలతో చర్చలు చేశారు.  బూత్ స్థాయి నుంచి వివిధ దశల ఇన్చార్జిలకు ఎప్పటికప్పుడు యాక్షన్ ప్లాన్ ఇచ్చేలా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ కమిటీల సాయంతో గత మూడు ఎన్నికలకు సంబంధించిన డేటాను పరిశీలించి, నియోజకవర్గంలో ఈసారి ఏం చేయాలనే దానిపై పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని నియోజకవర్గ నేతలకు సూచనలు చేశారు. ఇలా టి‌డి‌పి బలోపేతాన్ని సైలెంట్ గా చేస్తున్నారు. అదే సమయంలో పొత్తులపై బాబు సైలెంట్ గానే ఉన్నారు. పవన్ ఏమో..టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి కలిసి పోటీ చేస్తాయని చెప్పారు..కానీ దీనిపై బాబు స్పందించలేదు.

కానీ టి‌డి‌పి అంతర్గత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం…ప్రస్తుతానికి టి‌డి‌పి స్టాండ్ ఏంటంటే..గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కమ్యూనిస్ట్ పార్టీ అయిన సి‌పి‌ఐని కలుపుని టి‌డి‌పి పనిచేస్తుంది. ఇటు బాబు-పవన్ మూడుసార్లు కలిశారు. జనసేనతో కలిసి జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని బాబు చెప్పారు. ఇప్పటికీ ఈ రెండే జరుగుతాయని..పొత్తులపై ఎన్నికల సమయంలోనే బాబు నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news