కేసీఆర్ ఒక బచ్చా – ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈమధ్య మీడియాలలో చాలా కథనాలు చూస్తున్నామని.. అందరూ పార్టీ వీడి కాంగ్రెస్ లోకి వెళుతున్నారని అందరి మీద రూమర్స్ పుట్టిస్తున్నారని మండిపడ్డారు. మీడియా న్యూస్ రిపోర్టింగ్ చేయాలి కానీ న్యూస్ క్రియేట్ చేయవద్దని అన్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపి తో పొత్తు కానీ ఇతర ఏ పార్టీలతోనూ పొత్తు అనేది ఉండదని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికలలో సునామీలా దూసుకు వెళతామన్నారు అరవింద్. సైలెంట్ గా ఉన్నామంటే మాకు ఏం తెలియక కాదని.. కెసిఆర్ తాతకు కూడా జవాబు ఇవ్వడం మాకు తెలుసు అన్నారు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం సునామీ చూడబోతుందని అన్నారు. కేసీఆర్ ఓ బచ్చా అని.. ఆయన మర్యాద ఇస్తే మేము ఇస్తామని అన్నారు. రాబోయే ఎన్నికలలో కిషన్ రెడ్డి అధ్యక్షతన బిజెపి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news