బండి సంజయ్ ని అలా చూసి బాత్రూంలోకి వెళ్లి ఏడ్చాను – కోమటిరెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర మాజీ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని చూస్తుంటే తనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయని అన్నారు బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయనను అలా చూసి బాత్రూంలోకి వెళ్లి ఏడ్చానని భావోద్వేగానికి గురయ్యారు. నేడు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకోగా అనంతరం నిర్వహించిన సభలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బిజెపికి ఈ స్థాయిలో జోష్ వచ్చిందంటే దానికి కారణం బండి సంజయ్ అని చెప్పుకొచ్చారు.

కెసిఆర్ కి వ్యతిరేకంగా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో పోరాటం చేశారని.. బండి సంజయ్ ని పార్టీ గుండెల్లో పెట్టుకోవాలని అన్నారు. అధిష్టానం ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని అన్నారు కోమటిరెడ్డి. మునుగోడు లో ఓడిపోయినప్పటికీ నైతిక విజయం సాధించామన్నారు. రాజగోపాల్ రెడ్డి సత్తా ఏంటో వచ్చే ఎన్నికలలో చూపిస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news