ఐపీఎల్ కు ముందు మరియు ఐపీఎల్ తర్వాత గాయాల బారిన పడిన ఇండియన్ క్రికెటర్ ల గురించి ఒక అప్డేట్ ను బీసీసీఐ అందించింది. గాయాలు కారణంగా బెంగుళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ పొందుతున్న రాహుల్ , ప్రసిద్ధ కృష్ణ, బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ ల గురించి కీలక సమాచారం అందించింది. NCA ప్రకారం బుమ్రా మరియు ప్రసిద్ద కృష్ణలు నెట్స్ లో ఫుల్ స్ట్రెంగ్త్ తో బౌలింగ్ చేస్తున్నారట.. అంతే కాకుండా కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లను కూడా ఆడుతున్నారు అని తెలిపింది. ఇక బ్యాటింగ్ లో కె ఎల్ రాహుల్ మరియు శ్రేయాస్ అయ్యర్ లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక ఫిట్నెస్ సామర్ధ్యాన్ని పరీక్షించడానికి త్వరలోనే బ్యాటింగ్ డ్రిల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపింది.
ఇక డాషింగ్ ప్లేయర్ రిషబ్ పంత్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ మరియు జిమ్ లో కూడా ఎక్కువ సేపు కష్టపడుతున్నాడంటూ తెలిపింది. దీనిని బట్టి అతి త్వరలోనే ఇండియాకు వీరు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది.