మహిళా పోలీసులకు గుడ్‌న్యూస్‌.. కీలక ఆదేశాలు జారీ చేసిన డీజీపీ

-

ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళా పోలీసులను పోలీసు విధులకు వినియోగించరాదని తెలిపారు. మహిళా పోలీసును ఎందుకు ఏర్పాటు చేశామో ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గ్రామాల్లోని మహిళలు, చిన్నారుల సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని, బాధితులకు కావాల్సిన పూర్తి సహాయ సహకారాలను అందించడమే మహిళా పోలీసులను ఏర్పాటు చేయడం వెనుక గల ముఖ్య ఉద్దేశం అని వివరించారు.

Andhra Pradesh police focus on increasing conviction rate: DGP |  Visakhapatnam News - Times of India

ఇక, గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ పోలీసులను పోలీస్ శాఖలోని సాధారణ విధులైన బందోబస్తు, రిసెప్షన్ మరియు శాంతి భద్రతల వంటి వాటికి వినియోగించడం, తరచుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. ఎవరైనా అందుకు విరుద్ధంగా మహిళా పోలీసులను పోలీసు విధులకు వినియోగించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జిల్లా ఎస్పీలకు వార్నింగ్‌ ఇచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news