ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఐబీపీఎస్ విడుదల చేసింది. www.ibps.in వెబ్సైట్లో
హాల్టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్వర్డ్ లేదా బర్త్ డే వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డు పొందవచ్చు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు ఆగస్టు 6 చివరి తేదీ. ఆన్లైన్ విధానంలో ఆగస్టు, సెప్టెంబరులో పరీక్షలు నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డ్ అనేది పరీక్ష తేదీ, సమయం, వేదిక మొదలైన పరీక్షకు సంబంధించిన అన్ని సంబంధిత వివరాలను కలిగి ఉన్న ముఖ్యమైన పత్రం. చివరి నిమిషంలో రద్దీ లేదా సాంకేతిక సమస్యలను నివారించడానికి దరఖాస్తుదారులు తమ సంబంధిత అడ్మిట్ కార్డ్‌లను చాలా ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.