సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ జలమండలిలో పనిచేస్తున్న దాదాపు 4 వేల మంది ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలు 30% పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జలమండలి కార్మిక విభాగం జి. రాంబాబు యాదవ్, యూనియన్ నేతలు సీఎంను ప్రగతి భవన్ లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
అలాగే రెవెన్యూశాఖలోని వివిధ కేడర్లలో పదోన్నతులు కల్పించడంపై తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ వినతి మేరకు 61 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించారని వెల్లడించారు. డీటీల నుంచి తహసిల్దార్లుగా, సీనియర్ అసిస్టెంట్ల నుంచి డీటీలుగా త్వరలోనే పదోన్నతులు ఇవ్వనిందని రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.