దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 14వ విడత పిఎం కిసాన్ సొమ్ములను కేంద్ర ప్రభుత్వం ఈనెల 27వ తేదీన అంటే రేపు రైతులకు అందించనున్నట్టు వెల్లడించింది. ఏడాదికి మూడు విడతలుగా రూ. 2 వేల చొప్పున మొత్తం ఏడాదికి రూ. 6,000 పిఎం కిసాన్ యోజన కింద రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 27వ తేదీన రాజస్థాన్ లోని సికార్ లో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. కాగా, కేంద్రం ఎన్నో స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటోంది. రైతుల కోసం కూడా మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే సర్కార్ రైతుల కోసం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో పీఎం కిసాన్ యోజన పథకం ఒకటి.