కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటే : డీకే అరుణ

-

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, వారు గతంలో కలిసి పనిచేశారని, భవిష్యత్తులోనూ కలిసి పని చేస్తాయని డీకే అరుణ పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీపై లేనిపోని బురద జల్లుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినా బీఆర్ఎస్‌కు వేసినా ఒకటేనన్న విషయంపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీకే అరుణ కోరారు.

DK Aruna says BJP MP Dharmapuri Aravind family is under threat from TRS |  ఎంపీ అరవింద్‌ కుటుంబానికి ప్రాణహాని ఉంది.. కవితపై కేసు నమోదు చేయాలి: డీకే  అరుణతెలంగాణ News in Telugu

ఇది ఇలా ఉంటె కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి కాంగ్రెస్ సీనియర్లు కొంతమంది వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా చేరికలపై బిజెపి ప్రత్యేకంగా దృష్టి సారించింది.తెలంగాణలో బలమైన పార్టీగా అవతరించాలంటే పెద్ద ఎత్తున చేరికలు ఉండాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ లలోని అసంతృప్త నేతలతో తరచుగా సంప్రదింపులు చేస్తూ, పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news