ఎన్టీఆర్ ను చూసి భయపడిన స్టార్ హీరోయిన్.. కారణం..?

-

తెలుగు సినీ పరిశ్రమకి మూల స్తంభం అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఈయన ఎన్నో సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించడమే కాదు అంతకుమించి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మారి ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ని చూసి ఒక స్టార్ హీరోయిన్ భయపడిందట. ఆ ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

అప్పట్లో సినీ ఇండస్ట్రీలో మంచి పేరుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఎన్టీఆర్ , శ్రీదేవి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. అంతేకాదు వీళ్ళ విషయంలో అనేక రూమర్లు కూడా సృష్టించడం జరిగింది. అయితే సినీ తెలుగు సినిమా పై ఎన్టీఆర్ కి ఎంత మక్కువ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను చెప్పే ప్రతి డైలాగ్ లో కూడా ఆంగ్ల పదం లేకుండా చూసుకునేవారు. అంతేకాదు హీరోయిన్లకి కూడా డబ్బింగ్ చెప్పే సమయంలో గమనించి ఆంగ్ల పదాలను లేకుండా చూసేవారు. దీనివల్ల ఎన్టీఆర్ తో సినిమా తీయాలి అంటే డైలాగ్ రైటర్లు కూడా చాలా ఇబ్బంది పడేవారు.

అయితే ఎన్టీఆర్ , శ్రీదేవితో సినిమా చేసే సమయంలో షూటింగ్ స్పాట్ లో ఎంత ఆహ్లాదంగా ఉన్నప్పటికీ డబ్బింగ్ సమయంలో అంతే కామెడీ చేసేవారట ఎన్టీఆర్. శ్రీదేవితో..” కాస్త గట్టిగా తింటే డైలాగ్ బలంగా వస్తుంది.. కీచు గొంతు తో డైలాగ్ చెప్తున్నావంటూ కామెడీ చేసేవారట. దీంతో ఒక్కొక్కసారి అలిగి డబ్బింగ్ థియేటర్ నుంచి బయటకు వెళ్లి పోయేదట శ్రీదేవి. అంతేకాదు ఎన్టీఆర్ ఉంటే తాను డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎక్కడ కామెడీ చేస్తాడో అని భయపడి పోయేదట. అందుకే ఎన్టీఆర్ ఉంటే డబ్బింగ్ చెప్పను అని కండిషన్లు కూడా పెట్టేదట. ఆ రకంగా ఎన్టీఆర్ శ్రీదేవిని ఆటపట్టించే వారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news