ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి హాట్ కామెంట్స్ చేశారు. పొత్తులపై నిర్ణయం కేంద్ర నాయకత్వానిదేనంటూ ట్విస్ట్ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంలో వైఖరి ఏమిటో టీడీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ,బీజేపీ బంధం ఉంటే క్షేత్రస్థాయిలో మా పోరాటం ఎందుకు ఉంటుందని నిలదీశారు. అంశాల వారీగా మద్దతు ఇతర పార్టీలు ఇస్తున్నాయి….అంత మాత్రాన వైసీపీతో మాకు స్నేహం ఉన్నట్టేనా అని నిలదీశారు.
సర్పంచ్ ల సమస్యలపై ఈనెల 10న జిల్లా స్థాయిలో….17న ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్ట స్థాయిలో పోరాటం చేస్తామన్నారు. డిజిన్వెస్ట్ మెంట్ అనేది కేంద్రం నిర్ణయమని…. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ప్రయోజనాలకు కట్టుబడి వున్నామని ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ ను కేంద్రం విస్తరిస్తుంటే….ఇక్కడ ఎన్ని రహదారులు అభివృద్ధి చేశారో వైసీపీ పాలకులు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇన్వెస్టర్స్ సమ్మిట్ తర్వాత ఎంత పెట్టుబడులు వచ్చాయి…..ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆగ్రహించారు. ప్రభుత్వం ల్యాండ్ మాఫియా చేస్తోంది….చుక్కల భూముల క్లియరెన్స్ కోసం ప్రభుత్వ పెద్దలు, అధికారులకు లంచాలు ఇచ్చి క్లియర్ చేయించు కోవాలసి వస్తోందన్నారు పురందేశ్వరి.