జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్ని పర్యటనలు చేసినా ఆయనని పట్టించుకునే వారే లేరని.. అందుకే కాంట్రవర్సీ గా మాట్లాడుతున్నారని అన్నారు. వాలంటీర్లు 5000 రూపాయల గౌరవ వేతనం తీసుకొని సేవలు చేస్తున్నారని.. వాళ్ల వల్ల డేటా చౌర్యం జరుగుతుందన్నడం సరికాదన్నారు.
గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎవరు ప్రశ్నించలేదని అన్నారు. ఏపీలో కుళ్ళి కుషించిపోయిన టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీలో పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని ఎవరు అనుకోవడం లేదన్నారు. ఇక లోకేష్ ముందు మంగళగిరి సంగతి చూసుకోవాలని సూచించారు. సీఎం జగన్ ఏపీలో పథకాలు ఎలా అమలు చేస్తున్నారో ప్రజలను అడిగి తెలుసుకోండని చురకలంటించారు.