ఉక్రెయిన్ పై ఒకప్పుడు భీకర యుద్ధం చేసి ఆ దేశాన్ని గడగడలాడించిన రష్యా.. ఇప్పుడు అదే దేశం చేస్తున్న దాడులకు వణుకుతోంది. తాజాగా మాస్కో పై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్ల దాడి చేసింది. ఈ ఘటనతో మాస్కో నగరం అల్లాడిపోయింది. ఈ డ్రోన్ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ బలపడుతోందని.. ఇప్పుడు రష్యాకు యుద్ధం రాబోతోందని అన్నారు.
క్రమంగా యుద్ధం రష్యా భూభాగానికి తిరిగి వెళ్తోందని జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు. ఆ దేశ ప్రతీకాత్మక కేంద్రాలు, సైనిక స్థావరాలకు వ్యాపిస్తోందని.. ఇది అనివార్యమైన, సహజమైన, పూర్తి న్యాయమైన ప్రక్రియ అని తెలిపారు.
రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన ఉక్రెయిన్.. ఇప్పుడు ప్రత్యర్థి దేశంపై ఎదురు దాడికి దిగుతోంది. మాస్కోపై రివర్స్ అటాకింగ్ మొదలు షురూ చేసింది. ఇంతకాలం తమ దేశ భూభాగంపై అడుగు పెట్టడానికి యత్నించిన రష్యా సేనలను తిప్పికొడుతోంది.