జైపాల్ యాదవ్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి – మాజీమంత్రి చిత్తరంజన్

-

నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీమంత్రి చిత్తరంజన్ దాస్. గురువారం కల్వకుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుర్తిని అభివృద్ధి చేయడంలో జైపాల్ యాదవ్ విఫలం అయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కల్వకుర్తిలో అభివృద్ధి మాత్రం శూన్యం అన్నారు. జైపాల్ యాదవ్ తన అనుచరులతో ప్రెస్ మీట్ పెట్టి తనను తిట్టిస్తున్నాడని.. తాను బయటికి వస్తే మాత్రం పరిణామాలు వేరేవుంటాయని హెచ్చరించారు.

జైపాల్ యాదవ్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. కల్వకుర్తి అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి టిక్కెట్ వేరే వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవుల మీద తనకు ఆశ లేదని.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలనేది నా ధ్యేయం అన్నారు. బీసీలకు కల్వకుర్తి టికెట్ ఇస్తే తనకు అవకాశం ఇవ్వాలన్నారు. జైపాల్ యాదవ్ మీద తనకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవన్నారు. పార్టీలో నాయకులు టిక్కెట్ ఆశించడంలో తప్పులేదన్నారు చిత్తరంజన్ దాస్.

Read more RELATED
Recommended to you

Latest news