భారతదేశంలో నెక్స్ట్ జరిగే లోక్ సభ ఎన్నికలలో బీజేపీ మరియు ఎన్డీయే కూటమిలో ఉన్న పార్టీలను ఓడించి కేంద్రంలో అధికారం రాకుండా చేయడానికి కాంగ్రెస్ తో జతకట్టిన INDIA కూటమిలోని పార్టీలు అన్నీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దానికి తోడు బీజేపీకి ప్రజల నుండి కూడా వ్యతిరేకత ఉండడంతో వీరి పని కొంచెం ఈజీ అనే చెప్పాలి. కాగా తాజాగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీ పై సంచలన ఆరోపణ చేసింది. ఈమె మాట్లాడుతూ … వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఈవీఎం లను హ్యాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు మమతా బెనర్జీ. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయని ఎంతో నమ్మకంగా మమతా అన్నారు. ప్రజలు ఎన్నో సమస్యల వలన ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు.. వాటి నుండి ప్రజలను బయటపడేయాలంటే అది కేవలం ఇండియా కూటమి వలనే సాధ్యం అవుతుందని ఘంటాపధంగా మమతా బనెర్జీ చెప్పారు.
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో విజయం మాదే అంటూ మమతా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా మమతా చేసిన ఈ ఈవీఎం హ్యాక్ ఆరోపణలపై బీజేపీ రెస్పాండ్ అవుతుందా ?