ఈ డిజైన్లు టాటులుగా వేయించుకుంటే నెగిటివ్‌ ఎనర్జీ మీ వెంటే.. అంతా దురదృష్టమే

-

టాటూలు వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌ అయిపోయింది. చిన్నా పెద్దా, ముసలి, ముతక అని లేదు.. నచ్చిందా ఏదో ఒకటి వేయించుకుంటున్నారు. టాటూ వేయించుకుందాం అనుకుంటారు కానీ చాలా మందికి అసలు ఎలాంటిది వేయించుకోవాలి అని తెలియదు. ఏదో ఒకటి నచ్చితే దాన్ని టాటుగా వేయించుకుంటారు. కానీ ప్రతీ టాటూకు ఒక అర్థం ఉంటుంది. అది చూసేవాళ్లకు తెలియకపోయినా మీకు తెలియాలి. కొన్ని టాటూల వల్ల నెగిటివ్‌ ఎనర్జీ వస్తుందట. పోయి పోయి అలాంటివి వేయించుకుంటే ఫ్యాషన్‌ ఏమో కానీ మీ మైండ్‌ కరాబ్‌ అవుతుంది. కొన్ని రకాల టాటూ డిజైన్లను ఎప్పటికీ శరీరం మీద వేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. గవేందో చూద్దామా.।!

టాటూలు
టాటూలు

తిరగబడిన గుర్రపు డెక్క

గుర్రపు డెక్క గుర్తు అదృష్టానికి సంకేతం. అయితే ఇది తిరగబడిన విధంగా టాటూ వేయించుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయి. ఇలా తిరగబడిన గుర్రపు డెక్క డిజైన్ జీవితంలోని పాజిటివిటిని హరించే అశుభ సంకేతంగా భావిస్తారు. ఈ డిజైన్ శరీరం మీద వేయించుకుంటే దురదృష్టాన్ని ఆహ్వానించినట్టే.

పగిలిన గడియారం

పగిలిన గడియారం దురదృష్టానికి సంకేతం. వాస్తు ప్రకారం పగిలిన గడియారం ఆగిపోయిన సమయానికి చిహ్నం. అలాంటి పచ్చ బొట్టు శరీరం మీద వేసుకుంటే జీవితంలో పురోగతి కుంటుపడుతుంది.

పగిలిన అద్దం

పగిలిన అద్దం డిజైన్ అసలు శరీరం మీద వేసుకోకూడదు. పగిలిన అద్దం దురదృష్టానికి సంకేతం. పగిలిన అద్దంలో ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. ఇలాంటి చిహ్నాన్ని శరీరం మీద వేసుకోవడం అశుభం అని వాస్తు చెబుతోంది. ఇది జీవితంలోకి ప్రతికూలతను ఆహ్వానిస్తుంది. ఇటువంటి టాటూలు శరీరం మీద వేయించుకున్న వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన, వ్యాపార సంబంధ సమస్యలు ఉంటాయట.

ఏడుపు ముఖం

విచారంగా కనిపించే ముఖాలు ప్రతికూల భావనలు కలిగిస్తాయి. దురదృష్టాన్ని ఆకర్శిస్తాయట. జీవితంలో భావోద్వేగాలు చాలా ముఖ్యమైనవి. వాటిని వ్యక్తం చేసే విధానం మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. దుఖాన్ని తెలిపే పచ్చబొట్టు డిజైన్లు శరీరం మీద వేయించుకుంటే జీవితంలో అశుభాలు జరుగుతాయని శాస్త్రం చెబుతోంది. అలాగే మనిషి పుర్రె, పిల్లి, గబ్బిలం వంటి టాటూలు కూడా మీ జీవితానికి హానికరమే అని పండితులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news