బీజేపీని వీడటంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి సంచలన పోస్ట్ చేశారు. నాది పదవుల ప్రయాణ రాజకీయ జీవితం కాదని.. దైవాన్ని విశ్వసించే అంతఃకరణ, తరాల తెలంగాణ ప్రజల కష్టాలు చూసి చలించి, ఉద్యమించే మనో ప్రేరణ…రెంటి సమాహారం అంటూ అర్థం కానీ భాషలో విజయశాంతి పేర్కొన్నారు.
ఇది బహుశా తీవ్రమైన నా సంఘర్షణా భరిత 25 సంవత్సరాల రాజకీయ పయనం కావచ్చని వివరించారు. అయితే, బీజేపీ అంటే, నేను విశ్వసించే అంతఃకరణ నమ్మకం, తెలంగాణ అంటే ఆ విశ్వాసం, నమ్మకాలను మించిన నా ప్రజా ప్రయాణం అన్నారు. కానట్లయితే, 2005ల నేను, బీజేపీని వదిలి తెలంగాణ ఉద్యమ బాట పట్టి ఉండకపోవచ్చని తెలిపారు.
నాడు ఆత్మగౌరవ తెలంగాణా ఒక్క అంశం కాకుంటే, నేను 1998 నుండి 2005 వరకూ దేశమంతా పనిచేసిన నా బీజేపీని నాడు ఎందుకు దూరం చేసుకోవాల్సి వస్తది? అని వివరించారు. నేడు కొంతమంది బీజేపీ వ్యతిరేక మీడియా నా పైన చెప్తున్నట్లు, ఆ రెంటి మధ్య భవిష్యత్ ఘర్షణ… బహుశా వారి ఊహాగాన సృష్టిత అవాస్తవం కావచ్చని విజయశాంతి వెల్లడించారు.