సైకో జగన్ పాలనలో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అయ్యింది – నారా లోకేష్

-

సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సైకో జగన్ ఫ్యాక్షన్ పాలనలో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అయ్యిందన్నారు. పోలీసుల సమక్షంలో ప్రతిపక్షంపై దాడి చేసి, బంద్ చేయడం వైకాపాకే చెల్లిందని విమర్శించారు. వైసీపీ గూండా మూకలు బంద్ నెపంతో చిత్తూరులో అమరరాజా కంపెనీ బస్సుని ధ్వంసం చేసి ఉద్యోగులపై దాడి చేశారని ఆరోపించారు నారా లోకేష్.

శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నించారు. బంద్ పేరుతో వైకాపా అల్లరి మూకల దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కాగా పుంగనూరులో దాడి ఘటనను నిరసిస్తూ వైఎస్ఆర్సిపి శనివారం బంద్ కి పిలుపునిచ్చింది. శనివారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news