`బిగ్ బాస్` నాగార్జున‌ హిట్టా.. ఫ‌ట్టా..!

-

బిగ్ బాస్‌ ప్రస్తుతం ఇండియన్ బుల్లితెరను ఓ ఊపు ఊపేస్తోంది. ఏ భాషలో అయినా బిగ్ బాస్ హిట్ అవ్వాలంటే కంటెస్టెంట్‌లతో పాటు షోను సమర్థవంతంగా హోస్ట్ చేసే స్టాండర్డ్ హోస్ట్ కూడా చాలా ముఖ్యం. హిందీ బిగ్‌బాస్‌కి సల్మాన్‌ ఖాన్‌ దొరికినట్టుగా ఇంకా తెలుగు బిగ్‌బాస్‌కి స్టాండర్డ్‌ హోస్ట్‌ దొరకలేదు. సీజన్‌కి ఒకరు చొప్పున టెస్ట్‌ చేసుకుంటూ వెళుతున్నారు. ఎన్టీఆర్‌ తొలి సీజన్‌లో అదరగొట్టగా, నాని తనకి పరిచయం ఉన్న వారిని కంటెస్టెంట్లుగా పంపి విమర్శలు ఎదుర్కొన్నాడు. నాగార్జున అసలు తనకి సంబంధం లేని కంటెస్టెంట్‌లను హౌస్‌లోకి పంపించుకోమ‌ని చెప్పినా.. షో పై మాత్రం కమాండింగ్ తెచ్చుకోలేక పోయాడ‌న్న టాక్‌ షో ప్రారంభంలోనే వచ్చేసింది.

నాగార్జున ప్రతిరోజు షో చూసి బిగ్‌బాస్ షో పై ఏమనుకుంటున్నారో ? తెలుసుకొని హోస్ట్ చేస్తే నాగార్జునకు మంచి గ్రిప్‌ ఉండేది. కానీ.. బిగ్ బాస్ డైరెక్టర్లు స్క్రిప్ట్ రైటర్ల‌ మీద పూర్తిగా డిపెండ్‌ అయిపోవడంతో నాగ్‌కు ఆడియన్స్ పల్స్ దొరకలేదు. ముఖ్యంగా హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న బాబా భాస్కర్‌ను నాగ్‌ ఫేక్ మనిషిగా ముద్ర వేయడంతో సామాన్య జనాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పటికే బిగ్‌బాస్‌ షో శ్రీముఖికి అనుకూలంగా ఉందని హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు ఆరోపిస్తున్నారు.

బిగ్‌బాస్ డైరెక్టర్లు సైతం ఆమెకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక నాగార్జున సైతం శ్రీముఖి పై వచ్చిన ఆరోపణల నుంచి ఆమెను కాపాడేందుకు రకరకాల వీడియోలు చూపించి ఆమె తప్పేం లేదు అన్నట్టుగా చేస్తున్నారు. అయితే బయటకు వచ్చిన కంటెస్టెంట్ లు మాత్రం హౌస్‌లో జరుగుతున్న చెడు మాత్రం చూపించి మంచి చూపించడం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక హోస్ట్‌గా నాగార్జున విషయానికి వస్తే చాలాసార్లు హౌస్ లో ఏం జరిగిందో తనకు తెలియకుండానే కంటెస్టెంట్ల‌ను అడిగి తెలుసుకోవటంతో నాగార్జున అసలు ఎపిసోడ్స్ చూడటం లేదన్నది క్లారిటీ వచ్చేసింది.

టాక్‌ బ్యాక్‌లో ఇన్‌స్ట్రక్షన్స్‌ వింటూ రియాక్ట్‌ అవుతున్నారనేది తెలిసిపోవడం కూడా నాగార్జునకి బ్యాడ్‌ హోస్ట్‌గా పేరు తెచ్చింది. ఏదేమైనా ఈ సీజన్ ప్రారంభానికి ముందు నాగార్జున హోస్ట్ అనగానే ప్రతి ఒక్కరిలోనూ ఎన్నో అంచనాలు ఉన్నాయి. చివరికి నాగ్ ఆ అంచనాల్లో సగం కూడా అందుకోలేక పోయారు. నాగ్ వస్తోన్న వీకెండ్స్‌లో సైతం బిగ్ బాస్ టిఆర్‌పీ ఏ మాత్రం పుంజుకోలేదు. దీనిని బట్టి నాగార్జున హోస్టింగ్ అట్టర్ ఫ్లాప్ అయిందని స్పష్టంగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news