అన్నదాతలకు గుడ్ న్యూస్.. కేంద్రం నుండి ప్రతీ నెలా రూ.3,000..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ఎంతో ప్రయోజనం ఉంటోంది. ప్రతీ ఏటా రూ.6,000 పెట్టుబడి సాయాన్ని కేంద్రం ఇస్తోంది. అలానే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఇలా ఎన్నో స్కీమ్స్ ని తెచ్చింది. కేంద్రం తీసుకు వచ్చిన స్కీము లో ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన కూడా ఒకటి. రైతుల కి వృద్ధాప్యంలో పెన్షన్ ఇచ్చి ఆదుకోవడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యం.

farmers

రైతులు వృద్ధాప్యంలో ప్రతీ నెలా రూ.3,000 చొప్పున పెన్షన్ ని ఈ స్కీమ్ తో పొందవచ్చు. ఏడాదికి రూ.36,000 పెన్షన్ ని పొందొచ్చు. ఈ స్కీము లో చేరాలంటే రెండు హెక్టార్ల లోపు పొలం ఉన్న రైతులే అర్హులు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. అలానే కొంత ప్రీమియం కట్టాలి. వయస్సును బట్టి ప్రతీ నెలా రూ.55 నుంచి రూ.200 మధ్య కట్టాలి.

18 ఏళ్ల వయస్సులో చేరితే రూ.55 ప్రీమియం, 30 ఏళ్ల వయస్సులో చేరితే రూ.110 ప్రీమియం, 40 ఏళ్ల వయస్సులో చేరితే రూ.200 ప్రీమియం ఇలా వయస్సుని బట్టీ 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్లు పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.3,000 చొప్పున పెన్షన్ వస్తుంది. ఒకవేళ రైతు మరణిస్తే జీవిత భాగస్వామికి 50 శాతం ఫ్యామిలీ పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం. వద్దంటే మొత్తం, వడ్డీతో సహా తిరిగి పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news