కోరుట్ల బరిలో వారసుడు.. కారు విజయం దక్కేనా?

-

రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇవ్వడానికి కే‌సి‌ఆర్ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే కొందరిపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. దీంతో అలాంటి వారిని పక్కన పెట్టాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. బి‌ఆర్‌ఎస్‌కు 103 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో కనీసం 20 మందిని పక్కన పెడతారనే టాక్ ఉంది.

అదే సమయంలో తమకు సీటు దక్కకపోతే తమ వారసులకైనా సీటు దక్కించుకోవాలని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ సి‌ఎం కే‌సి‌ఆర్..ఏ ఒక్క వారసుడుకు పెద్దగా ఛాన్స్ ఇస్తున్నట్లు కనిపించడం లేదు. అయితే కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడుకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది.  గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్న విద్యాసాగర్ రావుపై కాస్త ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. ఎమ్మెల్యేగా బాగానే పనిచేస్తున్న..వరుసగా గెలవడం, అటు కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆ పార్టీపై సానుభూతి కనిపిస్తోంది. ఈ క్రమంలో తన బదులు తన తనయుడుకు సీటు ఇప్పించుకోవాలని విద్యాసాగర్ చూస్తున్నారు.

అయితే విద్యాసాగర్ తనయూ సంజయ్..చాలా రోజుల నుంచి నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా ఈయన కే‌టి‌ఆర్‌కు సన్నిహితుడు. దీంతో కే‌టి‌ఆర్..సంజయ్‌కు సీటు ఇస్తామని హామీ ఇచ్చేశారని తెలిసింది. ఈ క్రమంలో నెక్స్ట్ కోరుట్ల బరిలో సంజయ్ పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. విద్యాసాగర్ వారసుడు మినహా మరో నేత వారసుడుకు కే‌సి‌ఆర్ ఛాన్స్ ఇవ్వడం లేదని తెలిసింది.

కానీ చాలామంది ఎమ్మెల్యేలు తమ వారసులకు సీట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే,  నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌..ఇలా కొందరు సీనియర్లు తమ వారసుల సీట్ల కోసం కష్టపడుతున్నారు. కానీ కే‌సి‌ఆర్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కేవలం కోరుట్ల ఎమ్మెల్యే వారసుడుకే ఛాన్స్ ఇచ్చారు. మరి కోరుట్ల బరిలో విద్యాసాగర్ వారసుడు గెలుస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news