బిగ్‌బాస్: జర్నీ వీడియోలు కంటెస్టంట్లకు కలిసొస్తాయా..?

-

అల్లరి, గొడవలు,నవ్వులు, తిట్లు, గేమ్ ప్లాన్స్, ఎమోషన్స్… ఇవే బిగ్ బాస్ సీజన్-3లో కంటెస్టంట్ల మధ్య చోటు చేసుకున్న ఘటనలు. ఇప్పుడు అవే ఘటనలని బిగ్ బాస్ ఫినాలేకు చేరుకున్న ఐదుగురు ఇంటి సభ్యులకు వీడియో రూపంలో చూపించారు. అయితే ఆ వీడియోలు ప్రేక్షకుల మనసు కూడా దోచుకున్నాయి. ఇక ఈ వీడియోలు ప్రేక్షకుల దగ్గర నుంచి ఏ మేర ఓటింగ్ రాబడుతాయో చూడాలి. ఈ బిగ్ బాస్ జర్నీలో భాగంగా మొదట వరుణ్ బిగ్ బాస్ ప్రయాణాన్ని చూపించారు.

దానికంటే ముందు బిగ్ బాస్ వరుణ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ‘మిమ్మల్ని ప్రాబ్లమ్ సాల్వర్, మిస్టర్ కూల్, మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తారని, మీరు హౌస్‌లో చాలా బాధ్యతగా వ్యవహరించారని, మీరు అందర్నీ స్నేహితులుగా చూసి.. ఆట సమయంలో బలమైన పోటీదారుడిగా నిలిచారని చెప్పారు. ఇక వరుణ్ తర్వాత రాహుల్ వచ్చాడు. అతని జర్నీ కూడా వీడియో చూపించారు. అలాగే మొదట్లో స్నేహితులు గడిపారని, గేమ్ మీద దృష్టి పెట్టలేదని, కానీ మీ ఫ్రెండ్స్ వారి గేమ్ ఆడుతూనే మీతో స్నేహం చేశారని బిగ్ బాస్ రాహుల్ తో మాట్లాడాడు.

అయితే ఆ తర్వాత నుంచి మీ ప్రదర్శనతో ఒక్కో మెట్టూ ఎదుగుతూ వచ్చారని, వెనుతిరిగి చూసుకోలేదని, మీ ప్రదర్శనతో ఫినాలేకి చేరిన మొదటి కంటెస్టెంట్‌గా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారని ప్రశంసించాడు. ఇక నెక్ట్స్‌ బాబా భాస్కర్ పై కూడా బిగ్ బాస్ ప్రశంసల వర్షం కురిపించాడు. డ్యాన్స్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ లో మంచి వినోదం పంచారని, అది ఇంటి సభ్యులకే కాకుండా, ప్రేక్షకులకు నచ్చిందని చెప్పారు. చిన్న పిల్లాడిలా మీరు అల్లరి చేసినప్పటికీ.. ఇంటి సభ్యుల మధ్య ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా.. ఒక పెద్ద మనిషి పాత్ర పోషించి అందరి బాగోగులు చూసుకున్నారని చెప్పాడు.

అలాగే ఇష్టమైన వారే అనుమానిస్తే బాధపడ్డారని చెప్పి, బాబా జర్నీ వీడియోని చూపించారు. ఇక దీనికి బాబా ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి ఈ వీడియోల వల్ల ప్రేక్షకుల ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఇక మిగిలిన అలీ, శ్రీముఖి జర్నీ వీడియోలు గురువారం ఎపిసోడ్లో చూపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news