ముహూర్తం ఫిక్స్‌: జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న వల్లభనేని వంశీ..

కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం టీడీపీకి రాజీనామా చేయ‌డంతో ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా హీటెక్కాయి. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు, వంశీల మధ్య మెసేజ్ లు, లేఖలు కూడా నడిచాయి. కానీ, టీడీపీలో కొనసాగేందుకు వంశీ సుముఖత చూపలేదు.

మ‌రోవైపు ముఖ్యమంత్రి జగన్ తో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కూడా వంశీ చర్చలు జరపడంతో… ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.ఈ సందేహాలకు వంశీ ఫుల్ స్టాప్ పెట్టారు. వైసీపీలో చేరబోతున్నట్టు ఆయన తెలిపారు. నవంబర్ 3న కానీ లేదా 4న కానీ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు ప్రకటించారు.