ఏపీలో డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ వైఎస్సార్ సున్నా వడ్డీ నిధులు విడుదల చేయనుంది ఏపీ సర్కార్. ఇందులో భాగంగగానే ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలాపురంలో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ సున్నావడ్డీ పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు సీఎం జగన్. 9.48 లక్షల డ్వాక్రా గ్రూపులకు రూ. 1358.78 కోట్లను మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్.
దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05, 13, 365 మంది మహిళలకు లబ్ది చేకూరనుంది. అనంతరం జనుపల్లి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్… అనంతరం తిరిగి తాడెపల్లి గూడెం తిరిగి వెళ్లనున్నారు. కాగా, వైఎస్సార్ సున్నావడ్డీ నిధులు ఇవాల విడుదల చేయడం వరుసగా నాలుగో ఏడాది కావడం విశేషం.