నేడు తెలంగాణ, ఏపీకి భారీ వర్షాలు !

-

రెండు తెలుగు రాష్ట్రాలు అయినతెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్. మళ్లీ తెలంగాణకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

పలుచోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు కురుస్తాయంది. నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, హనుమకొండ, కామారెడ్డి, వరంగల్, సూర్యపేట, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక అటు హైదరాబాద్‌ మహా నగరంలో ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు.

గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌ మహా నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. అటు నేడు ఏపీలో మోస్తారు వర్షాలు పడనున్నాయని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. కర్ణాటక నుండి కొమోరిన్ వరకు విస్తరించింది ద్రోణి. వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news