అబద్దాలకు సీఎం కేసీఆర్ ప్రతిరూపం : కిషన్ రెడ్డి

-

అబద్దాలకు సీఎం కేసీఆర్ ప్రతిరూపమని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ధర్నా చౌక్ లో ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. పాత హామీలనే కొత్తగా చెబుతూ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అడుగడుగున అన్యాయం రాజ్యమేలుతుందని మండిపడ్డారు. అందుకే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలోనూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

Government made Governor Tamilisai Soundararajan utter lies in address: Kishan Reddy

హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంచే దమ్ము కేసీఆర్కు లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5లక్షల మంది ఇళ్లు లేని పేదలున్నారు. ఏపీలో 20లక్షల ఇల్లు కట్టించి ఇచ్చారు. తెలంగాణలో మాత్రం లక్ష ఇళ్లు కూడా కట్టలేదు. 5వేలలకు పైగా ఎకరాల అసైన్మెంట్ భూములు పేదల నుంచి కేసీఆర్ లాక్కున్నారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news