హీరో సిద్దార్థ్ పై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రముఖ నటుడు..కారణం..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో నేరుగా సినిమాలు చేసి ఇక్కడ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడుగా మారారు. ఇకపోతే తాజాగా వరాహ ఫిలిమ్స్ పతాకంపై సంగీత దర్శకుడు వి.ఆర్ స్వామినాథన్ రాజేష్ నిర్మించిన చిత్రం లోకల్ సారక్క. ఇందులో కొరియోగ్రాఫర్ దినేష్ , ఉపాసన హీరో హీరోయిన్లుగా నటించారు. ఇమాన్ అన్నాచ్చి, సింగం పులి, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే ఎస్వీ రాజకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని.. త్వరలో విడుదలకు సిద్ధం అవుతుండగా శనివారం ఉదయం చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యుడు, నటుడు ఎస్ . వీ. శేఖర్, నిర్మాత కే రాజన్, నటి వనిత విజయ్ కుమార్, విజయ మురళి, సౌదర పాండియన్, సంగీత దర్శకుడు దిన మొదలగు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో ఎస్ వి శేఖర్ మాట్లాడుతూ.. ఎంటర్టైన్మెంట్ పేరుతో చిత్రాలు ప్రజలకు హాని కలిగించవద్దు.. ఈ సినిమా టైటిల్ చూస్తే కొంచెం హార్డ్ గా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో కామెడీతో పాటు మంచి సందేశం కూడా ఉంది. దర్శకనిర్మాతలు చిత్ర టైటిల్ కోసం చాలా శ్రమిస్తున్నారు. కళాకారులకు ఆత్మవిశ్వాసం ఉండాలి.

ఈ నేపథ్యంలోనే నిర్మాత వై నాట్ శశికాంత్ అడిగితే ఒక నిమిషం నా వద్దకు వచ్చి టెస్ట్ మూవీ చేస్తున్నామని అందులో మీరు సిద్ధార్థ్ తండ్రిగా నటించాలని అడిగారు. అయితే ఆ తర్వాత ఆయన నా దగ్గరకు వచ్చి ప్రధాని మోడీ మద్దతుదారులైన మీతో మోడీని వ్యతిరేకించే సిద్దార్థ్ నటించినని చెప్పాడని.. దర్శక నిర్మాతలు చెప్పారు. దాంతో నేనేం చేయాలి అని అడగ్గా.. ఆ తర్వాత ఫోన్లో చిత్రకథ మారింది అని, మిమ్మల్ని తీసుకోవడం లేదని నాతో చెప్పారు. ఇక నిజానికి వృత్తి వేరు, రాజకీయాలు వేరు కదా.. ఇది చూస్తుంటే సిద్దార్థ్ నాతో నటించడానికి భయపడ్డాడు అనిపిస్తుంది అంటూ శేఖర్ తెలిపారు. అంతేకాదు ఈ విషయమై నిర్మాతల మండలిలో కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news