గోదావరి ఎక్స్ ప్రెస్ రైల్లో పొగలు, ప్యాసింజర్లను హడలెత్తించిన ఎలుక

-

గోదావరి ఎక్స్‌ ప్రెస్‌ రైల్లో ఎలుక కలకలం రేపింది. ట్రైన్ నంబర్ 12728 Hyderabad నుంచి వైజాగ్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు 3rd AC coach B4 లో క్యాబిన్ కంట్రోల్ పానెల్ లోకి ఎలుక దూరడం తో పొగలు వచ్చాయి.

ఈ ఘటన ఆదివారం రాత్రి 10.15 గంటల సమయంలో ఖమ్మం విజయవాడ మధ్యలో బోనకల్ స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. దాంతో ఒక్క సారిగా రైలు నిలిపేశారు. సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో టెన్షన్ నెలకొంది. ఎలుకను బయటకు తీసిన తర్వాత రైలు తిరిగి బయలు దేరింది. ఇప్పుడు ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news