తమకు భక్తుల రక్షణే ముఖ్యం : భూమన కరుణాకర్‌ రెడ్డి

-

కాలినడకన తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఒక చేతికర్ర ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.సోమవారంనాడు టీటీటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడారు. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు భద్రతను కల్పించే విషయమై హైలెవల్ కమిటీ చర్చించింది.ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల వరకే టూవీలర్స్‌కు అనుమతి ఇస్తామన్నారు. పెద్దలకు రాత్రి పది గంటల వరకే నడకదారిలో అనుమతి ఉంటుందన్నారు.

TTD Key Decisions: టీటీడీ హైలెవల్‌ కమిటీ కీలక నిర్ణయాలు.. నడకదారిలో ఇకపై  ఇవి కుదరదు.. - NTV Telugu

తమకు భక్తుల రక్షణే ముఖ్యమని, ఇందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. భూమన అధ్యక్షతన టీటీడీ హైలెవల్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం భూమన మాట్లాడుతూ… భక్తులపై చిరుత దాడి ఘటనపై చర్చించినట్లు చెప్పారు. అలిపిరిలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే పిల్లలను అనుమతిస్తామని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతించమన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news