కుటుంబంలో విభేదాలపై క్లారిటీ ఇచ్చేసిన సూర్య..!!

-

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన సూర్య ప్రస్తుతం వరుసగా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. తెలుగు తమిళంలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. ప్రస్తుతం సూర్య చేతిలో కంగువ, వాడి వసూల్ సినిమాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో నిత్య యాక్టివ్ గా ఉండే సూర్య ఈ మధ్యకాలంలో ఎక్కువగా ముంబైలో నివసిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అక్కడే తన ఫ్యాన్స్ మీట్ కి కూడా హాజరయ్యారు ఈ ఫ్యాన్స్ మీట్లో సూర్య తన సినిమాలకు సంబంధించి విషయాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేసినట్లు సమాచారం.

ముఖ్యంగా సూర్య ముంబైలో ఉండడంతో తన తండ్రి, తమ్ముడితో గొడవలు వల్లనే సూర్య కుటుంబం నుంచి విడిపోయి ముంబైలో ఇల్లు తీసుకుని ఉంటున్నట్లుగా వార్తలు వినిపించాయి.. అయితే ఇప్పటి వరకు సూర్య ఈ వార్తల పైన ఏ విధంగా స్పందించలేదు అయితే తాజాగా ఫ్యాన్స్ మీటిలో ఈ విషయం పైన స్పందించినట్లుగా తెలుస్తోంది సూర్య.. సూర్య ఈ విషయంపై మాట్లాడుతూ తమిళనాడును వదిలి ముంబైకి ఎందుకు వచ్చాననే విషయంపై మాట్లాడుతూ.. నేను తమిళనాడునీ వదలడం లేదు..అదే నా పుట్టిన ఊరు… నేను కుటుంబంతో సహా ముంబైలో ఉండడానికి కారణం తమ పిల్లలే అంటూ తెలిపారు.

వారి యొక్క చదువుల కోసం ఇక్కడే ఉండవలసి వచ్చింది..నేను ఎప్పటికీ తమిళనాడులోనే ఉంటాను ప్రస్తుతానికి తన కెరియర్లో కొత్తవి నేర్చుకోవాల్సినే తపనలో ఉన్నాను అంటూ తెలియజేశారు సూర్య.. దీంతో కుటుంబంలోని విభేదాలు వంటి రూమర్స్ కి చెక్ పడిందని చెప్పవచ్చు.. ఈ విషయం తెలిసి అటు అభిమానులు కూడా కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సూర్య తెలిపిన ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news