రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలపై వేదింపులు.. ఇతర ఆకృత్యాలు అరికట్టేందుకు.. సేప్టీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటును రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల పోలీస్ పనితీరుపై మంత్రి కేటీఆర్ ఫీదా అయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల జిల్లా పోలీస్శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని..ఇప్పటికే కరప్షన్ మొత్తం తగ్గించారని కొనియాడారు మంత్రి కేటీఆర్. కాగా, ప్రవర్తన మంచిగా లేని.. ఆరోపణలు ఉన్న పోలీసు అధికారులను జిల్లా దాటించారు. భౌవిష్యతుల్లో కూడా ఇలాంటి పనీతీరునే కొనసాగించాలని.. మారోద్దని ప్రజలు కోరుతున్నారు.
“Bus Lo Bharosa” by Sircilla Police launched by Minister @KTRBRS.We are installing CCTV cameras with connectivity to police control room in all 130 RTC buses in our district and all school buses with aim to reduce eve teasing
Speak UP about harassment and eve teasing to SHE TEAM pic.twitter.com/CZ6xavZOhw— Akhil Mahajan IPS (@spsircilla) August 15, 2023