అండర్ వేర్ తో ఉగ్రవాదిని గుర్తించారా…? ఎలా…?

-

తమ కంట్లో నలుసులా మారిన వారిని వెతికి వెతికి చంపడంలో అమెరికా దిట్ట. తమను ఇబ్బంది పెట్టె అవకాశం ఉందీ అనుకున్న వారి చావుని అమెరికా చూసే వరకు నిద్రపోయే అవకాశం ఉండదు. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, అంతర్జాతీయ ఉగ్రవాదుల చీఫ్ ఒసామా బిన్ లాడెన్ విషయంలో అమెరికా కొనసాగించిన వ్యవహారశైలే దీనికి ఉదాహరణలు. ఎవరిని ఎలా, ఎక్కడ ఏ విధంగా చంపాలో ఆ దేశానికి బాగా తెలుసు. తాజాగా ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదిని అదే విధంగా హతమార్చింది.

సిరియాలో ఆయన ఉన్న గ్రామాన్ని ఎనిమిది హెలికాప్టర్ల సాయంలో అమెరికా వెంటాడి వేటాడి చంపేసింది. గత కొన్నేళ్ళు గా ప్రపంచాన్ని వణికిస్తున్న నరరూప రాక్షసుడిని హతమార్చింది. అమెరిక అధ్యక్షుడు ట్రంప్ ప్రతీ క్షణం ఈ ఆపరేషన్ ని వీక్షిస్తూ ఆర్మీకి సలహాలు ఇస్తూ బగ్దాదిని అంతం చేసారు. బంకర్ లోకి పారిపోతున్న వ్యక్తిని శునకాలతో వెంటాడీ మరీ హతమార్చారు. తప్పించుకునే మార్గం లేక తన భార్యతో కలిసి బాగ్దాది బాంబులు పేల్చుకుని చనిపోయాడు. ఆయన శరీరం ఆనవాళ్ళు లేకుండా పేలిపోయిందని అమెరికా అధికారిక ప్రకటన చేసింది.

మరి ఆయన మృతదేహాన్ని ఏ విధంగా అమెరికా గుర్తు పట్టింది…? చనిపోయింది బగ్దాదీయే అని డీఎన్ఏ పరీక్షల ద్వారా నిర్ధారించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. బగ్దాదీ డీఎన్‌ఏ శాంపిల్స్ అమెరికాకు ఎలా చేరాయి? అనే ప్రశ్న వినపడటంతో ఈ ఆపరేషన్ లో అమెరికాకు సహకరించిన, కుర్దుల నేతృత్వంలో ఉండే… సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎసీడీఎఫ్) స్పందించింది. బగ్దాదీ అండర్‌వేర్‌ను తమ గూఢచారి దొంగిలించి తీసుకువచ్చారని, దాని ద్వారానే ఇప్పుడు మృతి చెందింది బగ్దాదీ అని తేల్చగలిగారని చెప్పడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news